Global enterpenurshipsumit

in #ges7 years ago

అసలు జరుగుతున్న ఈవెంట్ ఏంటి?
దాన్ని వదిలేసి ఇవాన్క ట్రంప్ మీద ఈ గోల ఏంటి?

GES (గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్) అనేది కేవలం అమెరికా కోసం అమెరికా చేసే విన్యాసం.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మంచి ఐడియాస్ ని , మంచి ఔత్సాహికుల్ని ఆకర్షించడానికి ఇది దోహదపడుతుంది. అమెరికా పెట్టుబడిదారుల కోసం, వారి పెట్టుబడి, భాగస్వామ్య మరియు సహకారం కోసం కొత్త అవకాశాలను సృష్టించేందుకు వ్యవస్థాపకులు మరియు పెట్టుబడిదారులను ప్రదర్శించడానికి ఉద్దేశించబడింది.

పైకి ప్రపంచంలోని ముఖ్యమైన సవాళ్ళను ఎదుర్కొనేందుకు కొత్త ఆలోచనలు జరిపే ఉద్దేశం ఉన్నా, లోలోపల అవి అమెరికా ద్వారానే జరగాలి, అమెరికా నే ఎప్పటికీ రారాజు గా ఉండాలి అనే కోణం లోంచి చర్చలు జరుపబడతాయి.

అమెరికా లో ఉన్న పెట్టుబడిదారుల్ని మిగతా దేశాలలో మంచి ఐడియాస్ ఉన్న కొత్తవాళ్ళని పరిచయం చేసే కారక్రమం. కేవలం నెట్ వర్కింగ్ కోసం అన్నమాట.

2010 లో దీన్ని ఒబామా స్టార్ట్ చేసాడు. ప్రతో ఏడాది ఒక్కో దేశం లో జరుగుతుంది. 2010 లో వాషింగ్టన్ లో, 2001 లో టర్కీ లో, 2012 లో దుబాయ్ లో, 2013 లో కౌలాలంపూర్ లో, 2014 లో మొరొక్కో లో, 2015 లో సిలికాన్ వాలీ లో జరిగాయి. అమెరికా నే స్పాన్సర్ చేస్తుంది.

ఈసారి హైదరాబాద్ లో చేస్తున్నారు. ప్రతి సమావేశానికి ఒక theme అనుకుంటారు. చర్చలు అన్నీ ఆ కోణం లో జరుపుతారు. అలా ఈసారి "Women first ,Prosperity for all " (మహిళా అభ్యున్నతి, అందరి శ్రేయస్సు) అనేది theme.

మామూలుగా అమెరికా అధ్యక్షుడు వస్తాడు ఈ సమావేశాలకు. ఇండియా కి ఎందుకు అనుకున్నాడో, ఈసారి మహిళల theme కాబట్టి అనుకున్నాడో, ఆయన కూతురిని పంపిస్తున్నాడు. అంతే. ఆమె ట్రంప్ కి పర్సనల్ అసిస్టెంట్ హోదా ఉంది, జీతం తీసుకోకుండా పని చేస్తోంది. పెద్ద అనుభవం, అధికారం ఏమీ లేవు.

ఇంతకుముందు సమావేశాలు జరిగిన ఏ దేశం లో అద్భుతాలు ఏమీ జరగలేదు. మీడియా కూడా ఈ విషయం వదిలేసి, చెమ్మ చెక్క...అంటూ ఊరికే పాట పాడుతోంది.

మనం ఇందులో ఆనందపడే విషయాలు రెండు - వచ్చినోళ్లంతా డబ్బు ఇక్కడే ఖర్చుపెడతారు, తెలంగాణ ప్రభుత్వానికి కొంత టాక్స్ లు వస్తాయి, రెండు, ఈ మీటింగ్ కోసమైనా రోడ్లు, లైట్లు రిపేర్ చేసారు, కొన్ని రోజులైనా బాగుంటాయి...... అంతే... అల్ప సంతోషులం కదా....
ఇలాగే కానిద్దాం..

Coin Marketplace

STEEM 0.16
TRX 0.15
JST 0.028
BTC 54166.76
ETH 2272.15
USDT 1.00
SBD 2.34